Koratala Siva Planning Big For NTR Devara 2: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సంచలన వసూళ్ల దిశగా పయనిస్తోంది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నాన్ స్టాప్ గా కోటి రూపాయల వసూళ్లు మాత్రం కచ్చితంగా సాధిస్తోంది. సినిమా విడుదలై 21 రోజులవుతోంది అయినా 19వ రోజు, 20వ రోజు కూడా కోటి రూపాయలు సాధించడం విశేషం. మూడువారాల్లో ఈ సినిమా ఏపీ, తెలంగాణలోనే రూ.130 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇక మొదటి భాగంలో అనేక అనుమానాలు ఉండడంతొ “దేవర 2” సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Love Reddy: “లవ్ రెడ్డి” గెలిచాడు, ఇండస్ట్రీ సపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం!
దేవర 1కి వచ్చిన విజయం తరువాత, ఈ సీక్వెల్ ఎలా ఉండనుందో అనే అంచనాలు పెరుగుతున్నాయి. “దేవర 2”లో కథను మరింత లోతుగా డిస్కస్ చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. దేవర 1లో లానే స్పెషల్ ఎఫెక్ట్స్ అలాగే సినిమాటోగ్రఫీతో, ప్రతి సీన్‌ను మరింత ఫ్రెష్ గా రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు. అలాగే ఈ సెకండ్ పార్ట్ లో కొంత మంది స్టార్ నటుల అతిధి పాత్రలు ఉంటాయని వాటి వలన కథలో ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటాయని అంటున్నారు. దేవర1లో వచ్చిన లోపాలను సరిచేసుకుంటూ దేవర2ను అద్భుతంగా చిత్రీకరించనున్నట్లు దర్శకుడు కొరటాల శివ చెబుతున్నారు.