Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్‌తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువసామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తన కెరీర్లోనే బెస్ట్ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’ (Thandel) చిత్రంతో తన కెరీర్లోనే మొదటిసారి రూ. 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ (Vrushakarma) అనే మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో నటిస్తూ బిజీగా ఉన్న చై.. తన తదుపరి చిత్రం కోసం ఒక సీనియర్ తమిళ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది.
గతంలో ‘పందెం కోడి’, ‘ఆవారా’ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వంలో నాగచైతన్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ కాంబినేషన్ వార్త అక్కినేని అభిమానుల్లో తీవ్ర చర్చకు, కొంత ఆందోళనకు దారితీసింది. ఎందుకంటే ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన లింగుస్వామి ట్రాక్ రికార్డ్ ఇటీవల ఆశించిన స్థాయిలో లేదు. రామ్ పోతినేనితో ఆయన తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలతో తెరకెక్కించిన ‘ది వారియర్’ (The Warriorr) చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. గతంలో నాగచైతన్య మరో తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు నమ్మి చేసిన ‘కస్టడీ’ (Custody) సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
దీంతో మళ్లీ ఫామ్‌లో లేని తమిళ దర్శకుడితో రిస్క్ చేయడం అవసరమా? ‘తండేల్’ తెచ్చిన వంద కోట్ల మార్కెట్‌ను చైతన్య కాపాడుకోవాలి కదా? అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ కేవలం రూమర్‌గానే మిగిలిపోతుందా లేక నిజంగానే నాగచైతన్య, లింగుస్వామికి లైన్ ఇస్తారా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?