Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుల్కర్ సల్మాన్ నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ (I’m Game). ఈ సినిమా వేడుకలో పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రైలర్ చూసి ఇదొక హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ అని ఫిక్స్ అయిన ప్రేక్షకులకు, నాగ్ అశ్విన్ ఒక మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్‌ను లీక్ చేసి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ఈ సినిమాలోని కొన్ని రషెస్ తాను ఇప్పటికే చూశానని నాగ్ అశ్విన్ వేదికపై వెల్లడించారు. “ట్రైలర్ చూస్తే మీకు ఇది భారీ యాక్షన్ ఫిల్మ్ లా మాత్రమే కనిపిస్తుంది. కానీ అందులో ఎవరూ ఊహించని ఒక సర్ ప్రైజింగ్ కాన్సెప్ట్ దాగుంది. సినిమాలో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్, మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఫన్ ఉంది. థియేటర్లలో ఆ కాన్సెప్ట్ రివీల్ అయినప్పుడు ఆడియన్స్ కచ్చితంగా థ్రిల్ అవుతారు” అని నాగ్ అశ్విన్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఒక డైరెక్టర్ స్వయంగా ఈ కామెంట్స్ చేయడంతో ‘ఐ యామ్ గేమ్’ మూవీ అసలు ఇతివృత్తం ఏంటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
‘మహానటి’ సమయం నుంచి దుల్కర్ సల్మాన్ జర్నీని తాను చాలా దగ్గరగా చూస్తున్నానని నాగ్ అశ్విన్ కొనియాడారు. మంచి సినిమా కోసం, కొత్త కథ కోసం దుల్కర్ ఎంతకైనా తెగిస్తాడని, సినిమా అంటే ఆయనకున్న ప్యాషన్ అలాంటిదని ప్రశంసించారు. వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని తెలిపారు. ఇందులో కీలక పాత్రలు పోషించిన నటుడు పెపే, నటి సంయుక్తల యాక్టింగ్ చాలా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ మంచి సినిమాలను, కొత్త కథలను గుండెలకు హత్తుకోవడం అలవాటని గుర్తుచేసిన నాగ్ అశ్విన్.. సెప్టెంబర్ 3న విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. ఇక ఈ ఈవెంట్ చివర్లో హోస్ట్‌తో కలిసి ‘బర్నింగ్ క్వశ్చన్స్’ గేమ్‌లో పాల్గొన్న నాగ్ అశ్విన్, సరదాగా సమాధానాలు చెబుతూ 25 పాయింట్లు సాధించి అందరినీ ఉత్సాహపరిచారు.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ... తీవ్ర ఆగ్రహం
తాజావార్తలు
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గంజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!