పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. మెగా సూర్య బ్యానర్ లో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
విడుదలకు కేవలం తొమ్మిది రోజులు ఉన్న హరిహర వీరమల్లు థియేట్రికల్ రైట్స్ విషయంలో ఇంకా తర్జన భర్జన కొనసాగుతుంది. ఆంధ్ర వరకు ఏరియాల వారీగా ఈ సినిమాను విక్రయించారు. కానీ నైజాం ఎవరు అనే దానిపై కొద్దీ రోజలుగా గందరగోళం నెలకొంది. మొన్నటి వరకు మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందని టాక్ వినిపించింది. కాదు కాదు దిల్ రాజు నైజాం రైట్స్ కొనుగోలు చేసారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా ఆ ఇద్దరు కాదు అమెరికా సుబ్బారావు రైట్స్ దక్కించుకున్నాడు అని ఇలా రోజుకొక పేరు వినిపించింది. అసలు విషయం ఏంటని ఆరాతీయగా అసలు వాళ్ళు ఎవరు కాదు హరిహార నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాను నైజాంలో సొంతగా రిలీజ్ చేయబోతున్నాడని తెలిసింది. నైజాం రైట్స్ విషయంలో నిర్మాత అటు ఇటుగా రూ. 45 కోట్లు అడుగుతున్నారని సమాచారం. కానీ బయ్యర్స్ రూ. 35 నుండి 38 కోట్లు వరకు కోట్ చేసారు. అటు నిర్మాత ఇటు బయ్యర్స్ మధ్య బేరం ఎటు తెగకపోవండతో సొంతంగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు నిర్మాత ఏ ఎం రత్నం.