Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mythology Movie Trend: నిన్న మొన్నటిదాకా తుపాకుల మోతలు, నెత్తుటి ఏరులు, డ్రగ్స్ మాఫియాల చుట్టూ తిరిగిన భారతీయ చిత్రసీమ.. ఇప్పుడు రూట్ మార్చింది. గ్యాంగ్‌స్టర్ జానర్ కాస్త చల్లబడటంతో దర్శకుల చూపు ఒక్కసారిగా వేల ఏళ్ల నాటి భారతీయ ఇతిహాసాల వైపు మళ్లింది. ‘కల్కి 2898 ఏడీ’, యానిమేషన్ మూవీ ‘మహా అవతార్ నరసింహ’ ఇచ్చిన భారీ హిట్స్‌తో మైథాలజీ కథలే సరికొత్త బాక్సాఫీస్ ఫార్ములాగా మారిపోయాయి. అయితే, ప్రతి ఒక్కరూ ఇదే ట్రాక్‌లోకి వచ్చేస్తుండటంతో థియేటర్లలో ప్రేక్షకులకు విరక్తి వచ్చే ప్రమాదం లేదా అన్న సరికొత్త చర్చ సినీ వర్గాల్లో మొదలైంది.
నితేష్ తివారి వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘రామాయణ పార్ట్-1’ ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ.. విమర్శల సెగ గట్టిగానే తగులుతోంది. గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించాలనే ఆరాటంతో అసలైన రామాయణ కథలో మార్పులు చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. విజువల్ గ్రాండియర్ పేరుతో మూలకథలోని ఆత్మనే దెబ్బతీస్తున్నారనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేవలం భారీ గ్రాఫిక్స్ పెట్టినంత మాత్రాన ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారా అనే సందేహాలు వస్తున్నాయి.
Also Read
- Ashok Selvan: 'కింగ్ 100'లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
- Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
- Katrina - Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
- Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
పురాణాలకు ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ టచ్ ఇస్తేనే జనం చూస్తారన్న నమ్మకం ‘కల్కి’తో బలపడింది. అందుకే ఇప్పుడు రాజమౌళి వారణాసి నేపథ్యంలో రామాయణ ఘట్టాలను భారీ కాన్వాస్‌పై చూపించేందుకు సిద్ధమవుతుండగా, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సహా పలువురు టాప్ స్టార్స్ ఇతిహాసాల బాట పడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా మైథాలజీ కథలతోనే వస్తే థియేటర్లకు వచ్చే ఆడియన్స్‌కు బోర్ కొట్టడం ఖాయమన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. దర్శకులు ప్రతి ఇతిహాసాన్ని సరికొత్త ప్రపంచంగా తీర్చిదిద్ది ఆకట్టుకుంటే ఫర్వాలేదు కానీ.. కేవలం హిట్ ఫార్ములా అనుకుని ఒకే తరహా విజువల్స్‌తో విసిగిస్తే మాత్రం ఈ ట్రెండ్ కూడా త్వరలోనే బోల్తా పడే ప్రమాదముంది.
తాజావార్తలు
-
Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
-
Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..
-
Cyber Crime: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. ‘పిన్ సర్వే’ సంస్థ నుంచి రూ. 8 కోట్లు లూటీ..
-
Ind Vs Pak: అండర్-19 ఆసియా కప్ 2026.. భారత్‌పై పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ..
-
Fire Accident: సీతాఫల్మండిలో టపాసుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!