Ajith-MS Dhoni-Rajinikanth at Kavya Anirudh wedding Reception: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సీఈవో కావ్య మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. 2026 నవంబర్ 11న గ్రీస్‌లో కావ్య-అనిరుధ్ వివాహం చేసుకున్నారు. ఇక శనివారం వీరి వివాహ రిసెప్షన్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు విచ్చేసి.. నూతన దంపతులను ఆశీర్వదించారు. రిసెప్షన్‌లో ఒకే ఫ్రేమ్లో ఇద్దరు ‘తలా’లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దిగ్గజం ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు. నూతన జంట కావ్య-అనిరుధ్‌ను ఆశీర్వదించారు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ధోనీ తొలిసారి కనిపించడం ఇదే తొలిసారి.
రిసెప్షన్‌కు తలా అజిత్ కుమార్ హాజరయ్యారు. కావ్య-అనిరుధ్‌ను సతీమణి షాలినితో కలిసి ఆశీర్వదించారు.
కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో తల ఎంఎస్ ధోనీ, తల అజిత్ కుమార్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో చెన్నై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇద్దరు తలాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఎంఎస్ ధోనీ, అజిత్ కుమార్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ జాయిన్ అయ్యారు. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్స్ కనిపించడంతో ఫాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఎంఎస్ ధోనీ, అజిత్ కుమార్‌ను రజనీకాంత్ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

