మనకు తెలిసి సెలబ్రిటీల లైఫ్ అంటే లగ్జరీ గుర్తుకు వస్తుంది. వారు మాములుగా చిన్న చిన్న బ్రాండ్స్ వాడారు. అన్ని బ్రాండెడ్ వస్తువులనే ఎక్కువగా వాడుతుంటారు. కాస్ట్లీ వాచ్‌లు, కారులు, బట్టలు ఇలా ప్రతి ఒక్కటి లక్షలోనే ఉంటాయి. ఆ మధ్య త్రిష ఈవెంట్లకు రెండు లక్షల డ్రెస్ వేసుకొచ్చింది. అయితే మృణాల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుందట.. ‘సీతారామం’ సినిమా ద్వారా పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రంతో మంచి విజయం అందుకుంది. ప్రజంట్ పాత్రలకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది. అయితే..
Also Read : Aamir Khan : మొత్తానికి గౌరీ గురించి మనసులో మాట బయటపెట్టిన అమీర్ ఖాన్.. !
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకి డ్రస్సుల పైన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదని.. ఇప్పటివరకు కొన్ని నా ఖరీదైన డ్రెస్ కేవలం 2000 అని చెప్పుకొచ్చింది. ఇద్దంతా నమ్మశక్యంగా లేదు కదా.. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నార్మల్ పీపులే వేలకు వేల డ్రేస్‌లు వేసుకుంటున్నారు. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి ఇలా మాట్లాడటం చూసి.. ‘ఈ హీరోయిన్ ఇంత పిసినారిలా ఉంది’ అని కామెంట్ లో పెడుతున్నారు అభిమానులు. కొంతమంది మాత్రం మృణాల్ చెప్పింది నిజమే అని.. తను డబ్బు విలువ తెలిసి ప్రవర్తిస్తుందని అభినందిస్తున్నారు.