Site icon NTV Telugu

Mollywood : మలయాళ సినిమా హిస్టరీని తిరగరాసేందుకు రెడీ అవుతుతున్న మోహన్ లాల్, మమ్ముట్టి

Pattroit

Pattroit

మోహన్ లాల్ , మమ్ముట్టి 2008లో వచ్చిన ‘ట్వంటీ: 20’ తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కాంబో మరో ఫుల్ లెంగ్త్ సినిమాలో సెట్ కాలేదు. సుదీర్ఘ కాలం తర్వాత పేట్రియాట్ మళ్ళీ ఈ కాంబినేషన్ ను స్క్రీన్ పైకి తీసుకొస్తోంది. దాంతో హైప్ లెవెల్ ఏంటో అర్థం అవుతుంది. టీజర్‌లో ఫహద్ ఫాజిల్ డైలాగ్  “మళ్లీ వాళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుందో తెలుసా?” అనే డైలాగ్ రాగానే సోషల్ మీడియాలో బూమ్ బ్లాస్ట్ అవుతోంది.

Also Read : K RAMP : కిరణ్ అబ్బవరం ర్యాంప్.. జస్ట్ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్

మహేష్ నారాయణన్ డైరెక్షన్‌లో వస్తున్న “పేట్రియట్” పాలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. లొకేషన్స్ లండన్ నుంచి విశాఖ, హైదరాబాద్ వరకు షూటింగ్ జరుపుకోవడం.. స్కేల్ చూస్తే ఇది మలయాళ సినిమా కాదు, పాన్ ఇండియా రేంజ్ లోనే రాబోతోందని కొద్దీ రోజుల క్రితం వచ్చిన టీజర్ ను బట్టి చెప్పవచ్చు. ఇటీవల మోహన్‌లాల్ ‘తుడరుమ్ ‘ హృదయ పూర్వం, ఇలా ఈ ఇయర్ వరసగా 4 సాలిడ్ సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మమ్ముట్టి బాజూకా తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఫుల్ ఫోర్స్‌లో ఉన్నాడు. ఈ ఇద్దరు కలిస్తే, ఫ్యాన్స్ కి అది గ్రాండ్ సేలబ్రేషన్ అంటున్నారు సినీ పండితులు. ఈ చిత్రంతో మలయాళ  హిస్టరీలో సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయం అని ట్రేడ్ అంచనా వేస్తుంది. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్, కావాల్సిన విధంగా క్రియేటివ్ విజువల్స్ మలయాళ సినిమా హిస్టరీలో ఒక మైల్‌స్టోన్ కావచ్చు అన్న అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.

Exit mobile version