Talasani Srinivas Yadav : ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేతనాలు పెంచాలంటూ తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల్లోని కార్మికులు నేడు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ముందు నిరసన చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. సినీ కార్మికుల డిమాండ్స్ కూర్చోని పరిష్కరించుకోవాలన్నారు. కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్మికులను చర్చలకు పిలవాలన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దని, లేబర్ డిపార్ట్మెంట్ కు సమ్మె లేఖ ఇవ్వలేదని ఆయన అన్నారు. రెండుమూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. నరేంద్రమోడీ రోజు ప్రపంచం గురించి నీతులు చెబుతారని, ప్రజా ప్రభుత్వాలు ఉండటం మోడీకి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్ట పోతుందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని, దేశం సర్వనాశం అవ్వాలని బీజేపీ కోరుకుంటుందని ఆయన విమర్శించారు.
తలెత్తుకుని గర్వంగా నిలబడలేకపోతుందని, ఎలక్టేడ్ గవర్నమెంట్లు ఉండటం ఓర్వలేక పోతున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని, మోడీ, షా దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లో అలానే జరిగిందని, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఇవ్వడం, బస్సులు ఏర్పాటు చేయడం అనుమానాలు కలిగిస్తోందన్నారు. అధికారం శాశ్వతం కాదు… బీజేపీ జీవిత కాలం అధికారంలో ఉండదన్నారు. మహారాష్ట్ర పరిస్థితి బీజేపీకి కూడా వస్తుందని, ఎప్పుడు అన్ని మనకు అనుకూలంగా ఉండవని ఆయన హితవు పలికారు. హైదరాబాద్ అందాలు, రాష్ట్ర ప్రగతిని మోడీ, బీజేపీ ముఖ్యమంత్రులు వచ్చి చూస్తారని, బీజేపీ ముఖ్యమంత్రులు చూసి నేర్చుకునే అవకాశం వచ్చిందన్నారు.
Also Read
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
- Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
- Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!