మైత్రి మూవీ మేకర్స్ నుండి బ్యూటీఫుల్ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్‌తో పాటు న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ దుగ్గిరాల హీరోగా,అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్ గా నటిస్తుండగా, హను రెడ్డి,స్వరాజ్ రెబ్బా ప్రగడ, సంజన, కన్నా పసునూరి, సమీరా కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ హార్ట్ వార్మింగ్ చిత్రం రిలీజ్ డేట్ ని మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు.
Also Read : Rashmika : రష్మికతో ఆ మూవీ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్?
ఇక ఇప్పటి వరకు విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా, తాజాగా మ్యూజికల్ జర్నీని కూడా స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ‘అందమా అందమా….’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచి ఈ లవ్ మెలోడీ ప్రేమించిన అమ్మాయి పట్ల తన ప్రేమ,అనురాగాన్ని ప్రజెంట్ చేసేలా సాగే ఈ పాట కట్టిపడేస్తుంది. వింటుంటే ఫీల్ గుడ్ టచ్‌ను ఇచ్చిన ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా, హేషమ్ అబ్దుల్ వహాబ్, ఆవాని మల్హర్‌తో కలసి మెస్మరైజింగ్ గా ఆలపించారు. హను రెడ్డి, అనంతిక కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. చూస్తుంటే ఈ మూవీ యూత్‌కి బాగా కనేక్ట్ అయేలా కనిపిస్తుంది.