Chiranjeevi: ఎక్స్ పీరియంలో తొలి షూటింగ్ నాదే!
- చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్‌పీరియం పార్క్
- తాజాగా నేడు ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డి
- ప్రారంభోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్‌పీరియం పార్క్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాందేవ్‌తో నా పరిచయం ఇప్పటిది కాదు. ఈ ఎక్స్‌పీరియం పార్కుని మీ అందరి కంటే ముందుగా నేను చూశా, 2000వ సంవత్సరంలోనే దీని గురించి రాందేవ్ నాతో పంచుకున్నారు. 2002 నుంచి నేను కూడా రాందేవ్ వద్ద నుంచి మొక్కల్ని తెప్పించుకుంటూనే ఉన్నా. మా ఇంట్లో ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు రాందేవ్ వద్ద నుంచి వచ్చినవే. రాందేవ్ ఓ వ్యాపారవేత్తగా ఎప్పుడూ ఆలోచించరు. పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచిస్తుంటారు. ఈ 150 ఎకరాలను వాణిజ్యంగానూ వాడుకోవచ్చు.

Chiranjeevi
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
కానీ ఆయన ఈ 25 ఏళ్లుగా రకరకాల మొక్కల్ని, వివిద దేశాల నుంచి కొత్త జాతి మొక్కల్ని ఇక్కడకు తీసుకొచ్చి ఈ పార్క్ నిర్మించారు. ఈ రకంగా రాం దేవ్ ఓ మంచి ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎక్స్‌పీరియం పార్కుని చూసి నేను, రేవంత్ రెడ్డి షాక్ అయ్యాం. ఇంత అద్భుతంగా ఉన్న ఈ పార్కుని చూసి షూటింగ్‌కు ఇస్తారా? అని రాం దేవ్‌ను అడిగా, ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే అయితే ఇస్తామన్నారు. కానీ ఈ ఎండలో నేను ఇక్కడ హీరోయిన్‌తో స్టెప్పులు వేయడం అంటే కాస్త కష్టమే. వర్షా కాలం తరువాత ఇక్కడ మరింత గ్రీనరీ వస్తుందని ఆ టైంలో షూటింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది, వెడ్డింగ్, రిసెప్షన్, ఇతర కార్యక్రమాలకు ఈ చోటు అనువైనదిగా ఉంటుంది. దేశ విదేశాల్లో ఉండే ఎన్నో అరుదైన జాతి మొక్కల్ని ఒక చోటకు చేర్చి ఇంత అద్భుతమైన పార్కుని రాం దేవ్ నిర్మించారు. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం అభినందనీయం. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి ప్రకృతి, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలకు రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!