Megastar Chiranjeevi: వారికి ‘మెగా’ భరోసా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. అవసరమైన చోట అండగా నిలబడటం, కష్టంలో ఉన్నవారికి చేయూత ఇవ్వడం… ప్రతి మనిషి జీవితంలో వెలుగులు నింపాలని ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నారు చిరంజీవి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లతో వేలాది మందికి ప్రాణం పోసిన ఆయన, కరోనా సమయంలోనూ, విపత్తుల సమయంలోనూ అండగా నిలిచారు. ప్రజలకు ప్రేమని పంచడమే తన బాధ్యతగా ముందుకు సాగుతున్న మెగాస్టార్, మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. హార్ట్ ఆపరేషన్ కోసం మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ (శివ) కు 10.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు మెగాస్టార్. అంతేకాకుండా, అపోలో ఆసుపత్రికి వ్యక్తిగతంగా వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుని, పూర్తి చికిత్స అందేలా చూసుకున్నారు.
అదే సమయంలో, తన మాజీ మేనేజర్ కె.వి. నరసయ్య కుటుంబానికి కూడా అండగా నిలిచారు మెగాస్టార్.
నరసయ్య భార్యకు అవసరమైన బైపాస్ శస్త్రచికిత్స కోసం 9.5 లక్షల రూపాయలు అందించి, ఆ కుటుంబానికి అత్యవసర సమయంలో ఆపద్బాంధవుడయ్యారు. సినీ సంఘాల సభ్యులు సహాయం కోసం మెగాస్టార్‌ను సంప్రదించగా, ఆయన వెంటనే పూర్తి బాధ్యత తీసుకుంటూ అన్నీ తానే చూసుకుంటానని చెప్పారు. ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, వైద్య బిల్లులపై రాయితీని ఇప్పించడానికి చిరంజీవి స్వయంగా ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు. ఫైనల్ బిల్లును కూడా స్వయంగా చెల్లించారు చిరు. ఇటీవల గద్దర్ అవార్డ్స్‌లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో పొందిన ₹10 లక్షలను పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందజేశారు మెగాస్టార్. మరో 5 లక్షలను తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు విరాళంగా అందించారు. తన సేవలతో ఎంతోమంది జీవితాలలో వెలుగుల్ని నింపుతున్న మెగాస్టార్ రియల్ హీరో. ఆయన సేవలు ఇలానే కొనసాగాలని, మెగాస్టార్ మార్గం మరెంతో మందికి స్ఫూర్తిగా మారాలని కోరుకుందాం.
Also Read
- Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
- Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
తాజావార్తలు
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
ట్రెండింగ్
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..