NTV Telugu Site icon

Mega 157: చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ లో వెంకటేష్ గెస్ట్ రోల్ ?

Chiranjeevi, Anilravipudi

Chiranjeevi, Anilravipudi

ప్రజంట్ మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ లతో వరుస ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెడుతూ ఫుల్ ఫామ్‌లో  ఉన్నాడు. తాజాగా ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీతో సూపర్‌హిట్ అందుకున్న అనిల్ రావిపూడి త‌న నెక్ట్స్ మూవీని చిరంజీవితో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మొన్న ఉగాది సంద‌ర్భంగా పూజా కార్యక్రమాలు జ‌రుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ ఆల్రెడీ పూర్తి చేసుకోగా, ప్రజంట్ ప్రీ ప్రొడ‌క్షన్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటుంది. రీసెంట్‌గా తన టీమ్‌ని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని కూడా విడుదల చేశారు. అయితే అనిల్ రావిపూడి ఐడియాలజి గురించి చెప్పాల్సిన పనిలేదు.. తన సినిమాలకు సంబంధించిన ప్రతి ఒకటి కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇక తాజాగా చిరంజీవి మూవీ కోసం అనిల్ భారీ ప్లానే వేసిన‌ట్టు తెలుస్తోంది.

Also Read: MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌ కోసం వస్తున్న NTR ?

అవును మెగా157 కోసం కూడా, అనిల్ ఎన్నో ఎట్రాక్షన్స్‌ను సినిమాలో చూపించ‌నున్నట్టు తెలుస్తోంది. చాలా కాలం త‌ర్వాత చిరూతో ఈ సినిమాలో ఓ పాట పాడించ‌నున్న అనిల్, దాంతో పాటూ తాజాగా ఈ మూవీలో వెంక‌టేష్‌తో ఓ గెస్ట్ రోల్ చేయించ‌బోతున్నాడట. నిజానికి వెంకీది జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమె కాద‌ట‌.. అత‌ని పాత్ర కోసం అనిల్ రావిపూడి స్పెష‌ల్‌గా ఒక ఫైట్ తో పాటు చిరు, వెంకీ వీరిద్దరి కాంబోలో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశారట. ఆ పాట‌ ఫ్యాన్స్‌కు పూన‌కాలు రావ‌డం గ్యారెంటీ అని టాక్ వినిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గార‌పాటి తో క‌లిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తోంది. కాగా నెక్ట్స్ ఇయ‌ర్ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.