NTV Telugu Site icon

MechanicRocky : తన పని ముగించేసిన విశ్వక్ సేన్.. ఇక అంత దర్శకుడిదే..?

Untitled Design (2)

Untitled Design (2)

విష్వక్ సేన్ కెరీర్ జెట్ స్పీడ్ లో వెళుతోంది. వరుస సినిమాలతో విశ్వక్ బిజీగా ఉన్నాడు. తాజగా ఈ  యంగ్  హీరో   నటించిన మూవీ ‘మెకానిక్ రాకీ’. విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధాదాస్ కథానాయకలుగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూన్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన మెకానిక్ రాకి ట్రైలర్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచింది.

Also Read: Indra4k: మురారి రికార్డుకు ఎసరు పెడుతోన్న మెగాస్టార్ ఇంద్ర..?

కాగా ‘మెకానిక్ రాకీ’ విశ్వక్ సేన్ యొక్క 10వ చిత్రం, ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రిలీజ్ కు మరికొద్ధి రోజులు మాత్రమే ఉన్న ఈ సినిమా అటు చివరి దశ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో స్పీడ్ పెంచారు. తాజాగా మెకానిక్ రాకి డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసాడు దర్శక నిర్మాతలు. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ మొదలుపెట్టాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కొద్దీ రోజుల క్రితం ఈ చిత్రం నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యొక్క ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సురేష్ సంస్థ కొనుగోలు చేసింది. మెకానిక్ రాకి సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించగా, ప్రముఖ కమెడియన్, నటుడు సత్యం రాజేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగ వ్యవహారిస్తుండగా జేక్స్ బిజోయ్ స్వరాలూ సమకూస్తున్నారు.