2026 సంక్రాంతి రిలీజ్ బరిలో ఉన్న సినిమాలలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ ఒకటి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ హారర్ కామెడీ చిత్రం విడుదల కానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో.. డైరెక్టర్ మారుతి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం మారుతి ఇంటర్వ్యూలు ఇస్తూ.. రాజాసాబ్ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో బొమన్ ఇరానీ పాత్ర గురించి చెప్పి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు.
‘రాజాసాబ్ సినిమాలో మరో కీలక పాత్ర బొమన్ ఇరానీ గారిది. ట్రైలర్‌లో ఆయన పాత్రను అందరూ చూశారు. ఆ పాత్ర, మేకింగ్ చాలా వెరైటీగా ఉంటుంది. సైకియాట్రిస్ట్‌గా బొమన్ ఇరానీ కనిపిస్తారు. ఆయన పాత్రను లైబ్రరీలో ఎక్కువగా షూట్ చేశాం. అయన పాత్ర రాగానే మూవీ టోన్ పూర్తిగా మారుతుంది. హారర్ కామెడీ నుంచి ఎవరూ ఊహించని విధంగా సినిమా రన్ అవుతుంది. పాత్రకు తగ్గట్టు బొమన్ ఇరానీ గారు సులభంగా సిద్ధమయ్యారు. ప్రతి డైలాగ్ తెలుగు, హిందీలో ప్రాక్టీస్ చేశారు. ఇలాంటి వారు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు. 3 ఇడియట్స్‌లో ఆయన చేసిన వైరస్ పాత్ర మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రాజాసాబ్‌లో బొమన్ ఇరానీ 15 నిమిషాలు పైనే ఉంటారు. ఆయన ఉన్నంతసేపు అందరూ ఓ ట్రాన్స్‌లోకి వెళ్లిపోతారు. థియేటర్లో మీరే చూడండి’ అని డైరెక్టర్ మారుతి చెప్పారు.
Also Read: IND vs BAN Schedule: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. కొత్త షెడ్యూల్ రిలీజ్!
రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించారు. సంజయ్ దత్, బొమన్ ఇరాని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. 15 ఏళ్ల తర్వాత ఎంటర్‌టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, ప్రతి అభిమానిని ఈ చిత్రం అలరిస్తుందని ప్రీ-రిలీజ్ వేడుకలో ప్రభాస్ చెప్పారు. రెబల్ ఫాన్స్ రాజాసాబ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.