Site icon NTV Telugu

Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?

Mani Ratnam

Mani Ratnam

ఇటీవలే తగ్ లైఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక దారుణమైన డిజాస్టర్ మూటగట్టుకున్నాడు బెస్ట్ డైరెక్టర్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం. నిజానికి ఆయన చేసే సినిమాలు ఎక్కువగా ఇంటెన్స్ డ్రామాతో గానీ లేదా మంచి రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలుగానీ ఉంటాయి.

Also Read:Raviteja: ఆగస్టులో ‘మాస్ జాతర’ చేయాల్సిందే!

అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన నవాబ్ గానీ, పీఎస్ వన్, పీఎస్ టూ గానీ, తర్వాత చేసిన తగ్ లైఫ్ గానీ ఆయన తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమాలే. అయితే ఇప్పుడు ఆయన తన కంఫర్ట్ జోన్‌లోకి వెళ్లి మరో లవ్ స్టోరీ, అది కూడా ఇప్పటి ట్రెండ్‌ను అర్థం చేసుకునే ఆడియన్స్‌కి తగ్గట్టుగా రాసుకుంటున్నాడట.

Also Read:8 Vasanthalu : బ్రాహ్మిణ్ పాత్రతో కాశీ ‘కబేళా’లో రేప్ చేయిస్తారా?

నిజానికి ఆయన చేసిన సఖి, ఓకే బంగారం లాంటి సినిమాలు మంచి హిట్‌లుగా నిలిచాయి. గీతాంజలి లాంటి సినిమా హిట్ కాకపోయినా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించిన సినిమాగా నిలిచింది. ఈ క్రమంలోనే అలాంటి మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు ఆయన ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. క్యాస్టింగ్ విషయంలో Simbu అని ఒకసారి, నవీన్ పోలిశెట్టి అని మరోసారి వార్తలు వచ్చాయి. అంతేకాక, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, వీరిలో ఎవరిని ఫైనల్ చేశారు, చివరికి ఎవరు నటిస్తారనే విషయాలు స్వయంగా మణిరత్నం క్లారిటీ ఇస్తే తప్ప చెప్పలేము.

Exit mobile version