Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ చిత్రం ‘ప్రేమలు’ డబ్బింగ్ తో తెలుగు ఆడియన్స్ కి మమిత బాగా దగ్గరైంది. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్ కు ఫిదా అయిపోయాడు. కట్ చేస్తే తెలుగు, తమిళం, మలయాళం అన్న తేడా లేకుండా బిజీ అయిపోయింది. ప్రేమలు తర్వాత తెలుగులో రిలీజ్ అయిన ‘డ్యూడ్’ లో ప్రదీప్ రంగనాథన్, మమిత యాక్టింగ్ లో పోటీ పడి మరీ మెప్పించారు. స్టార్ హీరోల పక్కన మమిత డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తోంది.
సూర్య, విజయ్ మధ్య ఏజ్ లో పెద్ద గ్యాప్ లేదు. విజయ్ కు 51 అయితే సూర్యకు 50. ‘జననాయగన్’ లో విజయ్ కూతురుగా నటిస్తున్న మమిత, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ లో సూర్యను ప్రేమించే అమ్మాయిగా కనిపిస్తోంది. ఇలా స్టార్స్ పక్కన డిఫరెంట్ రోల్స్, కథలతో కనిపించనుంది మమిత. ఈ రెండు సినిమాలు మూడు వారాల గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి. ఈ నెల 23న జననాయగన్, ఆగస్టు 14న విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ అవుతుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ అయిన వారానికే, ఆగస్టు 21న మమిత నటించిన మలయాళ చిత్రం ‘బెత్లేహేమ్ కుటుంబం’ విడుదలవుతుంది. మమితకు ప్రేమలు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన గిరీష్ ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాను డైరెక్ట్ చేయడంతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇందులో యంగ్ స్టార్ నివిన్ పౌలీతో జతకడుతోంది మమిత.
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
ఒకేసారి రెండు సినిమాలతో, నెల తిరగకుండా మూడు సినిమాలతో గతంలో చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. అయితే మమిత ఒకేసారి మూడు భాషలను కవర్ చేసింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో, జననాయగన్ తమిళంలో, బెత్లేహేమ్ కుటుంబం మలయాళంలో రూపొందింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మమిత, 15 సినిమాల్లో నటించిన తర్వాత 16వ సినిమా ‘ప్రేమలు’ క్రేజ్ తీసుకొచ్చింది. తెలుగులో స్టార్ హోదా దక్కితే హిందీ ఆఫర్స్ వస్తాయి, ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ పెరుగుతుంది. ఇప్పటికే రెండు కోట్లు తీసుకుంటున్న మమిత, మూడు నాలుగు కోట్లు టార్గెట్ గా పెట్టుకుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగు, తమిళంలో హిట్ అయితే నాలుగు కోట్ల డ్రీమ్ తీరినట్టే.
తాజావార్తలు
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!