Actress Sajini : నన్ను చంపాలని చూస్తున్నారు.. నటి సంచలన ఆరోపణలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి సజిని, ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సుమారు రూ. 10 కోట్ల విలువైన ఆస్తి కోసం తన అక్క, అక్క భర్త, వారి పిల్లలు కలిసి తనను శారీరకంగా, మానసికగా హింసిస్తున్నారని ఆమె మీడియా ముందు వాపోయారు. సజిని “2001లో నేను సినిమాల్లో నటించి సంపాదించిన డబ్బుతో మా అమ్మ పేరు మీద జూబ్లీహిల్స్‌లో ఒక ఇల్లు కొన్నాను, అప్పట్లో ఎంతో ప్రేమతో కొన్న ఆ ఇల్లే ఇప్పుడు నా పాలిట శాపంగా మారింది. నెల రోజుల క్రితం మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి నా కుటుంబ సభ్యుల ప్రవర్తన పూర్తిగా మారిపోయింది” అని తెలిపారు. ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో తనపై దాడులు చేస్తున్నారని సజిని ఆరోపించారు. “మా అక్క, ఆమె పిల్లలు, వారి భర్తలు కూడా నన్ను కొడుతున్నారు. అమ్మ చనిపోయినప్పటి నుంచి నన్ను టార్గెట్ చేసి నరకం చూపిస్తున్నారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను పిచ్చిదానిగా ముద్ర వేసి, మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తామని బెదిరిస్తున్నారని, తద్వారా తన ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read :Suspended: ఆ పని చేసినందుకు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై వేటు.. సస్పెండ్ చేసిన కలెక్టర్..
Also Read
గతంలో మలయాళంలో బీ గ్రేడ్ సినిమాల్లో నటించిన సజిని, తన కష్టార్జితాన్ని అంతా కుటుంబం కోసమే ఖర్చు చేశానని, కానీ నేడు అదే కుటుంబం తనను రోడ్డున పడేయాలని చూస్తోందని కన్నీరు పెట్టుకున్నారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తి ముందు రక్తసంబంధాలు, బంధుత్వాలు చిన్నబోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఆస్తి కోసం ఒక నటిని ఇలా వేధించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని సజిని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!