గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు. SSMB 29 పేరుతో ఈ సినిమాని సంబోధిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సమ్మర్ బ్రేక్ ఇచ్చారు. ఎప్పటిలాగే మహేష్ బాబు వెకేషన్‌కి వెళ్లిపోయాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు. అయినప్పటికీ ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయాలనే విషయం మీద ఆయన టీం ప్లానింగ్ రెడీ చేస్తోంది.
Also Read : Trivikram: చరణ్ తో రెండు సినిమాలు సెట్ చేసిన గురూజీ..
నిజానికి ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన ముగ్గురు దర్శకులను లైన్‌లో పెట్టారు. ముందుగా సందీప్ రెడ్డి డైరెక్షన్‌లో ఒక సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అప్పటికే సందీప్ రెడ్డి 100% సిద్ధంగా లేకపోతే, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ‘Kalki 2898 AD’ సినిమా తర్వాత ఆ సినిమా బాగా నచ్చడంతో మహేష్ బాబు స్వయంగా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపాడు. వైజయంతి మూవీస్‌తో అనుబంధం కారణంగా నాగ్ అశ్విన్ కూడా మహేష్ తో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఆ సమయానికి ఆయన కూడా అందుబాటులో లేకపోతే..
Also Read : ‘Thug Life’ : కమల్ హాసన్ మాటలు.. నా తండ్రి రాజ్‌కుమార్‌ని గుర్తుచేశాయి
అప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్‌లో సినిమా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బుచ్చిబాబు రామ్ చరణ్ హీరోగా ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే మహేష్ కోసం తాను ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నానని గతంలో కూడా ఆయన వెల్లడించారు. కాబట్టి రాజమౌళి సినిమా తర్వాత వెంటనే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరితో ఒక సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్‌ని బ్రేక్ చేశాడు కాబట్టి, దాన్నే కంటిన్యూ చేయాలని మహేష్ టీం చాలా ఫోకస్‌గా మంచి కథ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.