Site icon NTV Telugu

RRR : RRR టీమ్‌తో సందడి చేయనున్న మహేష్ బాబు

Mahesh Bab

Mahesh Bab

ఈ రోజు ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు మహేష్ బాబు కూడా కనిపించబోతున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఈ రోజు లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్’ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ మొత్తం హాజరు కాబోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు లండన్‌లో విహారయాత్రలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆహ్వానం మేరకు మహేష్ బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోజు సాయంత్రం వారంతా కలిసి తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు.

Also Read: Cult: 40 మంది కొత్త నటీనటులతో జ‌ప‌నీస్‌, స్పానిష్‌, ఇంగ్లీష్ రిలీజ్?

నిజానికి, ఇలా ఒకే స్టేజ్‌పై ఇద్దరు హీరోలను గతంలో చూసినప్పటికీ, రాజమౌళి హీరోలు ముగ్గురూ ఒకే వేదికపై కనిపించడం అసాధారణం. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబుతో ఓ గ్లోబల్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు, కానీ ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’గా తాత్కాలికంగా పిలుస్తున్నారు. మొత్తానికి, మహేష్ బాబు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌తో కలిసి సందడి చేయబోతుండడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version