విశ్వక్‌సేన్ దర్శకుడిగా మారి ‘కల్ట్’ అనే సినిమా చేయబోతున్నాడు. నిజానికి కొత్తవారిని పరిచయం చేస్తూ ‘కవిత’ అనే సినిమా చేస్తానని విశ్వక్‌సేన్ రెండు, మూడేళ్ల క్రితం ప్రకటించాడు. ఆ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఈ రోజు పట్టాలెక్కింది. విశ్వక్‌సేన్ తండ్రి కరాటే రాజు మరియు సందీప్ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు మొదట విశ్వక్‌సేన్ కేవలం దర్శకుడిగా మాత్రమే పనిచేయాలనుకున్నాడు. కానీ, చివరి నిమిషంలో అతను కూడా నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాతో 40 మంది కొత్తవారిని ఆడిషన్స్ ద్వారా పరిచయం చేయబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా గాయత్రి భరద్వాజ్ నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా యజ్ఞ తుర్లపాటి నటిస్తున్నట్లు ఈ రోజు స్పష్టత వచ్చింది.
ALso Read:Dude: ‘డ్యూడ్’ మమిత బైజూ.. భలే ఉందే!
ఈ సినిమా తెలుగు, తమిళ భాషలతో పాటు జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ వంటి భాషల్లో కూడా విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, విశ్వక్‌సేన్‌కు పాన్-గ్లోబల్ గుర్తింపు లేనప్పటికీ, జపాన్‌లో అతనికి కొంత ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్‌తో పాటు, సినిమా కంటెంట్ పార్టీ థ్రిల్లర్‌గా ఉండడంతో అన్ని భాషల వారు, అన్ని దేశాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అతను భావిస్తున్నాడు. అందుకే ఈ సినిమాను పాన్-గ్లోబల్ రేంజ్‌లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చివరగా ‘లైలా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచిన విశ్వక్‌సేన్ ఈ సినిమాతో హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి.