Varanasi: జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా..‘వారణాసి’ యాక్షన్ ఎపిసోడ్స్‌పై క్రేజీ బజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘వారణాసి’ (Varanasi). ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతున్నప్పటికి.. తాజా సమచానం ప్రకారం వచ్చే జూన్ రెండో వారం నుండి ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన, సుదీర్ఘమైన యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. జూన్ సెకండ్ వీక్ నుండి స్టార్ట్ కాబోయే కొత్త షెడ్యూల్లో మహేష్ బాబుపై అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే సుమారు నెలకు పైగా నాన్-స్టాప్ షూటింగ్ సాగనుండటం విశేషం.
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ఈ సినిమాలో మహేష్ బాబు మునుపెన్నడూ చేయని విధంగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇందులో ‘రుద్ర’.. ‘శ్రీరాముడు’ అనే రెండు పవర్ఫుల్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఈ చిత్రంలో ‘మందాకిని’ అనే కీలక పాత్రలో నటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ గట్టి ప్లాన్‌తో ఉన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా జెండాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన రాజమౌళి.. ఈసారి మహేష్ బాబుతో కలిసి ఏ రేంజ్ గ్లోబల్ వండర్ క్రియేట్ చేస్తారో చూడాలి!
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!