కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి అడుగుపెట్టిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.145 కోట్ల గ్రాస్ వసూలు చేసి ‘మెగా బ్లాక్ బస్టర్’గా నిలిచింది. బాక్సాఫీస్ రాంపేజ్ సృష్టిస్తున్న ఈ సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సూర్య యాక్టింగ్, డైరెక్టర్ టేకింగ్‌పై మహేష్ బాబు తన ట్వీట్లో ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాను తాను చూశానని, చాలా కూల్‌గా, స్మార్ట్‌గా, ఆద్యంతం ఎంతో ఫన్‌గా సాగిందని ఆయన కితాబిచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలో ‘ఇన్బరాజ్’ పాత్రలో సూర్య నటన అద్భుతంగా ఉందని, ఆయన పర్ఫార్మెన్స్ ఫ్యాబులస్ అంటూ ఆకాశానికెత్తేశారు. ఇక ఇతర కీలక పాత్రల్లో నటించిన నజ్రియా, నస్లెన్ కూడా ఫెంటాస్టిక్ గా నటించారని మహేష్ అప్రిషియేట్ చేశారు.
ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జితు మాధవన్ పనితనాన్ని మహేష్ బాబు ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఆయన బ్రిలియంట్ రైటింగ్, అద్భుతమైన ఎగ్జిక్యూషన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసించారు. 24 క్రాఫ్ట్స్‌లో ప్రతి విభాగం ఎంతో ఇంప్రెస్ చేసిందని, కచ్చితంగా ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడాల్సిన సినిమా అని మహేష్ తన రివ్యూ ఇచ్చారు. ఒక పక్క కేవలం 3 రోజుల్లోనే 145 కోట్లతో బాక్సాఫీస్ షేక్ అవుతుంటే.. మరోపక్క మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ స్వయంగా సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేయడంతో ‘సీన్’ మూవీకి ఎక్కడలేని హైప్ వచ్చేసింది. ఈ ఊపు చూస్తుంటే రాబోయే రోజుల్లో సూర్య మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

