Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతుండటంతో మహేశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై కూడా భారీ ఆసక్తి నెలకొంది. అయితే ‘వారణాసి’ తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. దీంతో పలువురు డైరెక్టర్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ బాబు తనకు హిట్ ఇచ్చిన దర్శకులతో మరోసారి పనిచేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతారనే విషయం తెలిసిందే. ‘ఒక్కడు’ తర్వాత గుణశేఖర్‌తో ‘అర్జున్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో ‘బ్రహ్మోత్సవం’, ‘దూకుడు’ తర్వాత శ్రీను వైట్లతో ‘ఆగడు’ సినిమాలు చేశారు. అయితే ఈ కాంబినేషన్లలో కొరటాల శివతో చేసిన రెండు సినిమాలు మాత్రమే సూపర్ సక్సెస్ అయ్యాయి. ‘శ్రీమంతుడు’ తర్వాత ‘భరత్ అనే నేను’తోనూ మహేశ్ – కొరటాల కాంబో మహేష్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది.
ఇక ‘సరిలేరు నీకెవ్వరు’తో హిట్ అందించిన అనిల్ రావిపూడితోనూ మరోసారి సినిమా చేయడానికి మహేశ్ ఆసక్తి చూపించిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందని గతంలో అడిగినప్పుడు.. అనిల్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు సినిమా చేస్తానంటూ మహేశ్ చెప్పారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్ ప్రాజెక్ట్‌పై కూడా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో మహేశ్ – అనిల్ కాంబినేషన్ మరోసారి పట్టాలెక్కుతుందా? అనే చర్చ మొదలైంది. మరోవైపు మహేశ్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు కూడా మరోసారి వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమాతో బిజీగా ఉన్న వంగా.. ఆ తర్వాత ‘యానిమల్ పార్క్’ తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత మహేశ్‌తో సినిమా చేసే అవకాశం ఉందని ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా హింట్ ఇచ్చారు.
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
‘వారణాసి’ తర్వాత మహేశ్‌తో సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు టాక్. మైత్రీ మూవీ మేకర్స్, హోంబలే ఫిలింస్ వంటి సంస్థలు మహేశ్‌తో ప్రాజెక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆ తర్వాత వెంటనే మహేశ్ కొత్త సినిమాను ప్రారంభిస్తారా? లేక కొంత విరామం తీసుకుంటారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహేశ్‌కు నచ్చే కథను ఎవరు సిద్ధం చేస్తారు? ‘వారణాసి’ తర్వాత ఆయన ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!