టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు 41వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖుల నుంచి, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సుధీర్ బాబుకు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషెస్ తెలిపారు. “హ్యాపీ బర్త్‌డే సుధీర్! మీకు ఎల్లప్పుడూ ఆనందం, విజయం లభించాలని కోరుకుంటున్నాను” అంటూ గతంలో సుధీర్ తో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేశారు. కాగా సుధీర్ కు మహేష్ బాబు బావ వరుస అవుతాడు. మంజుల ఘట్టమనేని సుధీర్ తో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేస్తూ “పుట్టినరోజు శుభాకాంక్షలు సుధీర్ బాబు… మీకు అద్భుతమైన విజయం చేకూరాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె , మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శినిని సుధీర్ బాబు వివాహం చేసుకున్నారు. స్టార్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ దానిపై ఆధార పడకుండా సుధీర్ బాబు తన ట్యాలెంట్ తో స్టార్ గా ఎదిగాడు.
సుధీర్ బాబు 2012లో ‘ఎస్ఎంఎస్’తో ఎంట్రీ ఇచ్చి, హర్రర్-కామెడీ ‘ప్రేమ కథా చిత్రం’తో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ‘కృష్ణమ్మ కలిపిండి ఇద్దరిని’, ‘భలే మంచు రోజు’ వంటి కంటెంట్ ఆధారిత చిత్రాలలో కూడా నటించారు. 2018లో సమ్మోహనం, నన్ను దోచుకుందువటే చిత్రాలతో బ్యాక్-టు-బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో నటిస్తున్నారు.