SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ “గుంటూరు కారం”..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం మహేష్ తరువాత మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ తరువాత సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లు నిర్మాత కేఎల్ నారాయణ అప్డేట్ అందించారు.ఈ సినిమాలో మహేశ్ బాబు లాంగ్ హెయిర్‌తో స్టన్నింగ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
Read Also : Coolie : కూలీ కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ షాకింగ్ రెమ్యూనరేషన్ ..?
అయితే వీరి కాంబినేషన్ లో సినిమా ప్రకటించినప్పటి నుంచి స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ మహేష్ తన అభిమానులను సర్ప్రైజ్ చేస్తూనే వున్నారు. తాజాగా బ్లూ టీషర్ట్‌లో , బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న మహేష్ స్టైలిష్ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.మహేష్ నయా లుక్ చూసిన అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు.గ్లోబల్ అడ్వెంచరస్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.ఈసినిమాను దర్శకుడు రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో పలువురు టాప్ హాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నట్లు సమాచారం.