అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహావతార్ నరసింహ’ సినిమా ఎన్నో సంచలన రికార్డులను బద్దలు కొడుతూ దూసుకు వెళుతోంది. అత్యంత తక్కువ బడ్జెట్‌లో డైరెక్టర్ అశ్విన్ కుమార్ సారధ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఆయన భార్య నిర్మాతగా మారి, ఈ సినిమాకి ఇద్దరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అవుట్‌పుట్ చూసిన హోంబాలే ఫిల్మ్స్ సంస్థ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ తమ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో రిలీజ్ చేసింది.
Also Read:Ghaati : అనుష్కకు ఏమైంది.. ఎందుకు ఇలా చేస్తోంది..?
ఇక, ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు దూసుకొచ్చిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది. ఈ సినిమా శనివారం రోజు, అంటే నిన్న, ఏకంగా ఇండియా మొత్తం మీద ఆరు కోట్ల కలెక్షన్లను రాబట్టింది. సినిమా రిలీజ్ అయిన 30వ రోజు, అది కూడా ‘కూలీ’, ‘వార్ 2’ లాంటి సినిమాల పోటీని తట్టుకుని ఆ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికే 259 కోట్ల రూపాయల కలెక్షన్లను క్రాస్ చేసిన ఈ సినిమా, ఈ రోజుతో 300 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘మహావతార్ పరశురామ్’ సినిమాను రూపొందించేందుకు దర్శకుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.