Site icon NTV Telugu

Mahavatar Narsimha: 150 కోట్లు కొల్లగొట్టిన యానిమేషన్ నరసింహుడు

Mahavathar

Mahavathar

హీరోలే లేకుండా చేసిన మహా అవతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తోంది. తాజాగా ఈ సినిమా 150 కోట్లు కలెక్షన్స్ మార్క్‌ను క్రాస్ చేసింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ఆయన భార్య శిల్పా ధావన్ నిర్మాతగా ఈ సినిమాని రూపొందించారు. సినిమా పూర్తయిన తర్వాత దాన్ని హోంబాలె ఫిలిమ్స్‌కు చూపించడంతో హోంబాలె ఫిలిమ్స్ దానిని సమర్పించేందుకు ముందుకు వచ్చారు.

Also Read : Chiranjeevi: చిరంజీవితో ఫెడరేషన్ ప్రతినిధుల భేటీ .. అసలు నిజం ఇదే?

అలా మొదలైన ఈ ప్రయాణంలో గీతా ఆర్ట్స్ సంస్థ కూడా జాయిన్ అయింది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచి అన్ని రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళ్తోంది. ఇక తాజాగా ఈ సినిమా 150 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్‌ను దాటినట్లుగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూర్తిగా యానిమేషన్‌లోనే రూపొందించబడిన ఈ సినిమా ఆ మార్క్ క్రాస్ చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమాకి ఈ రోజుకు కూడా హౌస్ ఫుల్ పడుతున్నాయంటే సినిమా కంటెంట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version