ఈ మధ్య కాలంలో డీప్‌ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీల ఫోటోలను మార్చేసి నెట్టింట రచ్చ చేస్తున్నారు. అసలు నిజమేంటో తెలియక జనం కూడా అది చూసి మోసపోతున్నారు. ఇప్పటికే చాలా మంది నటినటులు దీని బారిన పడగా.. తాజాగా ఇలాంటి ఫేక్ కంటెంట్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి నటుడు మాధవన్ ఇప్పుడు సీరియస్ అయ్యారు. తన పర్మిషన్ లేకుండా తన పేరును, ఫోటోలను వాడుకుంటూ కొన్ని వెబ్‌సైట్లు అశ్లీల కంటెంట్‌ను తయారు చేస్తున్నాయని మాధవన్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి తన ఇమేజ్‌ను వాడుకుంటున్నారని ఆయన పిటిషన్ పెట్టారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. సోషల్ మీడియాలో ఉన్న ఆ గలీజు కంటెంట్‌ను వెంటనే తీసేయాలని ఆర్డర్ వేసింది.
Also Read : Parashakti : రిలీజ్ ప్లాన్ మార్చిన ‘పరాశక్తి’ టీమ్..ఏకంగా విజయ్‌తో తలపడనున్న కార్తికేయన్
ముఖ్యంగా ఏఐ(AI)ని వాడి ‘కేసరి 3’, ‘షైతాన్ 2’ లాంటి సినిమాల నకిలీ ట్రైలర్ క్రియేట్ చేసి, అవి మాధవన్ సినిమాలే అని నమ్మించేలా ప్రచారం చేస్తున్నారట. దీనిపై మాధవన్ లాయర్ కోర్టులో వాదించగా.. ఏఐ గురించి మాకు ఇంకా పూర్తి ఐడియా లేదని, దీనిపై స్టడీ చేశాకే మరిన్ని ఆర్డర్లు ఇస్తామని జడ్జి గారు చెప్పారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ లాంటి పెద్ద హీరోలు కూడా ఇలాగే కోర్టుకెళ్లి తమ హక్కులను కాపాడుకున్నారు.
