M4M Movie: మే 8న థియేటర్లలోకి ‘ఎం4ఎం’.. పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు!
- మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఎం4ఎం
- సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఎం4ఎం
- పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో రూపొందిన ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లింగ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో అమెరికన్ నటి జో శర్మ, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ సహకారంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
భారతదేశంలో ఎం4ఎం చిత్రాన్ని పీవీఆర్ ఇనాక్స్ పిక్చర్స్ విడుదల చేయనుండగా.. అమెరికాలో టెక్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఉత్తర భారతంలో జేవీఈఎల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు విడుదల బాధ్యతలు చేపట్టాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. థియేటర్లలోకి రాకముందే ఎం4ఎం చిత్రం అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందింది. ప్రముఖ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పాలైస్ సి థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన జరగగా.. ముంబైలోని ఇంపా ప్రివ్యూ థియేటర్‌లో కూడా స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ ప్రదర్శనలకు సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన లభించింది.
Also Read
హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్‌లో నిర్వహించిన ప్రమోషన్ టూర్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకువచ్చింది. సినిమా విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. మే 8న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నామని తెలిపారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడటం గర్వకారణమని, ప్రీమియర్ షోలకు అద్భుత స్పందన వచ్చిందని చెప్పారు. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నమ్మకం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!