LuckyBaskhar : తడిసిన కళ్ళతో, నవ్వుతున్నపెదాలతో థియేటర్ నుంచి బయటకు
- దుల్కర్ సల్మాన్ స్ట్రయిట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్
- ఘనంగా లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- దివాళీ కానుకగా రిలీజ్ కానున్న లక్కీ భాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు.
Also Read : Tamannaah : అందాల తమన్నా.. ఎంత బాగుందో ముద్దుగుమ్మ..
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ తరం గొప్ప నటులు దుల్కర్ సల్మాన్ ఒకరు. ఈ సినిమా గురించి చెప్పాలంటే. ఏ సినిమా అయినా మనం చూసేటప్పుడు మనకి అందులో ఉన్న కథానాయకుడు నెగ్గుతూ ఉండాలని కోరుకుంటాం. ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, భాస్కర్ లక్కీ అవ్వాలని మనం సినిమా మొత్తం కోరుకుంటూనే ఉన్నాం. ఫైనల్ గా అతను లక్కీ గానే బయటకు వస్తాడు. ఈ సినిమాకు లక్కీ భాస్కర్ అనే టైటిల్ యాప్ట్. దుల్కర్ మామూలు నటుడు కాదు. అతను చేసిన ప్రయత్నం మనకి కనపడకుండా ఉండటానికి అతను చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్. మమ్మూట్టి లాంటి మర్రిచెట్టుకి పుట్టాడు. మర్రిచెట్టు కింద మొక్కలు బ్రతకవని చెబుతుంటారు. కానీ దాని నుంచి బయటకు వచ్చి తన ప్రయాణాన్ని తను మొదలుపెట్టడం, తన రోడ్డు తను వేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆయన దుల్కర్ కెరీర్ చూసి తండ్రిగా గర్వపడతారు. తడిసిన కళ్ళతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్ లోనుంచి మీ అందరూ బయటకు వస్తారు. ఈ దీపావళి వెంకీకి, ఈ సినిమాకి పని చేసిన అందరికీ చాలా ఆనందాన్ని ఇస్తుందని నాకు తెలుసు. నేను నమ్ముతూ, ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. సినిమాలో దుల్కర్ నటన చూసి ప్రేమలో పడిపోయాను ‘ అని అన్నారు.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!