DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DC Release: దళపతి విజయ్ – స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మాస్టర్, లియో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించాయో తెలిసిందే. వీరిద్దరి మధ్య అనుబంధం కూడా వేరే లెవల్ అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రంగా ప్రచారంలో ఉన్న ‘జన నాయకుడు’ రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకు అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫిషియల్‌గా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూలై 23న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఇదే సమయంలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ‘DC’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి దళపతి జన నాయకుడు సినిమా రిలీజ్ డేట్ రాక ముందు ఈ చిత్రాన్ని జూలై 31న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫిషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు. అయితే దళపతి బాక్సాఫీస్ ముందుకు రావడంతో లోకేష్ పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘DC’ సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ మేకర్స్ కొత్త రిలీజ్ పోస్ట్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా, లోకేష్ కనగరాజ్ – వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్-రొమాన్స్ చిత్రంలో లోకేష్ కనకరాజ్ ‘దేవదాస్’ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లో లోకేష్ కనగరాజ్ మాస్ గ్యాంగ్‌స్టర్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Also Read
Devadas and Chandra are ready to light up the big screen! #DC Releasing worldwide from July 31❤️🔥#DCFromJuly31@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial @WamiqaG @isanjkayy @mukesh_DOP #PrasannaGK #KannanS @PC_stunts @kabilanchelliah#DCTheBloodyValentineFromJuly31 pic.twitter.com/DaJLz6lx9D
— Sun Pictures (@sunpictures) July 1, 2026
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?