ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ డిమాండ్ ఉన్న యువ దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ పేరు ఒకటి. 2019లో లోకేష్ కగరాజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ‘ఖైదీ’ ఎంత బ్లాక్ బాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ తర్వాత విక్రమ్, లియో వంటి ప్రాజెక్ట్స్ లతో మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ కథతో ఒక యూనివర్స్ ను క్రియేట్ చేశారు. ఇక తన క్రియేటివ్ మేకింగ్ స్టైల్‌తో భారీ హైప్ క్రియేట్ చేసే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి చేస్తున్న ‘కూలీ’ చిత్రంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొన్న లోకేష్, మీడియా ఎదుట ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్టార్ హీరో అజిత్‌తో సినిమా చేసే అవకాశం గురించి వచ్చిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ..
Also Read : Aamir khan : ‘సితారే జమీన్ పర్’ డిజిటల్ ప్లాన్ అదుర్స్.. కానీ వర్కౌట్ అవుతుందా ?
‘అజిత్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. మన మధ్య సినిమా ఖచ్చితంగా వస్తుంది, కానీ సరైన సమయం వచ్చినప్పుడు’ అని తెలిపారు. ఈ స్టేట్‌మెంట్‌తో అజిత్-లోకేష్ కలయికపై అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు కమల్ హాసన్, రజినీకాంత్ వంటి సీనియర్ లెజెండ్స్‌తో పాటు, తన తరం హీరో విజయ్‌తో రెండు సినిమాలు చేసిన లోకేష్.. అజిత్‌తో మాత్రం ఇప్పటివరకు అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు ఈ కామెంట్స్‌తో ఆ ఛాన్స్‌కి గ్రీన్ సిగ్నల్ పడినట్టే కనిపిస్తోంది. ఇప్పుడంతా ఎదురు చూస్తున్న ప్రశ్న.. “ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు ఫుల్‌ఫిల్ అవుతుంది?”