కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ మ్యాజిక్ తో, దర్శకత్వ ప్రతిభతో బ్లాక్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. తోలి సినిమా నుండి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్ గా మరాడు లోకేష్. కార్తి హీరోగా వచ్చిన ఖైదీ చిత్రంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసాడు. లోకనాయకుడు కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాను ఖైదీ సినిమాతో లింక్ చేస్తూ చివరిలో రోలెక్స్ పాత్రతో సూర్యను లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్సల్ కొనసాగించాడు. విజయ్ హీరోగా వచ్చిన లీవో చిత్రంతో లియో చిత్రంతో ఖైదీ, విక్రమ్ సినిమాలను లింక్ చేస్తూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ చేసాడు.
Also Read : Tollywood : ఆపరేషన్ సింధూర్ పై సినీ తారల ఎమోషనల్ ట్వీట్స్
తాజాగా లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో మరో హీరో వచ్చి చేరాడు. కాంచన సిరీస్ తో అలరించిన రాఘవ లారెన్స్ హీరోగా ‘బెంజ్’ అనే సినిమాను ప్రకటించాడు లోకేష్. ఈ సినిమాకు కథ లోకేష్ కనకరాజు అందించాడు. కాగా ఈ సినిమాలో ఇప్పుడు మరొక స్టార్ హీరో వచ్చి చేరాడు. ప్రేమమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మలయాళ హీరో నివిన్ పౌలి బెంజ్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే తమిళ సీనియర్ హీరో మాధవన్ కూడా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. భాగ్యరాజ్ కన్నన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కోలివుడ్ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ పై మాస్ యాక్షన్ డ్రామాగా రానుంది బెంజ్ .