LGBT: శంకరాభరణం లాంటి చరిత్ర సృష్టిస్తుంది: ఎల్బీ శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ కోర్ట్‌రూమ్ డ్రామా “ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్“. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా, గే మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న దేశవ్యాప్తంగా విడుదలైన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో గే, ట్రాన్స్ జెండర్స్ హక్కుల కోసం అండగా నిలుస్తున్న పలు సేవా సంస్థల నిర్వాహకులను చిత్ర యూనిట్ ఘనంగా సత్కరించింది.
సక్సెస్ మీట్లో సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “ఈ సినిమాతో సునీల్ కుమార్ రెడ్డి ఒక సరికొత్త చరిత్ర సృష్టించారు. గే, ట్రాన్స్ జెండర్ల సమస్యలను ఇంత నిర్భయంగా ప్రస్తావిస్తూ వచ్చిన తొలి పూర్తిస్థాయి చిత్రం ఇదే. గతంలో ‘శంకరాభరణం’ సినిమా ఎలాంటి చరిత్ర సృష్టించిందో.. ఈ అర్థనారీశ్వర కథాంశంతో వచ్చిన చిత్రం కూడా మరో చరిత్ర సృష్టించబోతోంది. నా కెరీర్లో ‘అమ్మో ఒకటో తారీఖు’ చిత్రం ఎంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందో.. ఈ సినిమా కూడా అంతే గుర్తింపు తెచ్చిపెడుతుంది” అని ఎల్బీ శ్రీరామ్ కొనియాడారు.
Also Read
- Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
- Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
- Marriage Rumours: జయరామ్ - సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
- Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
చిత్ర దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు, ఛారిటీ సంస్థలకు ధన్యవాదాలు. సమాజంలో ట్రాన్స్ జెండర్స్ ఎదుర్కొంటున్న వివక్ష పూర్తిగా తొలగిపోవాలని, వారికీ అందరిలాగే సమానత్వం దక్కాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సినిమాను రూపొందించాను. థియేటర్ల నుండి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే సమాజంలో ఒక మంచి మార్పునకు గట్టి అడుగు పడిందని నమ్ముతున్నాను” అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!