LGBT 2: సెకండ్ పార్ట్ అనౌన్స్.. ఆ దర్శకుడిపై ఎల్.బి. శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాన్స్జండర్ వ్యక్తుల జీవితాలు, వారి ఆత్మగౌరవ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన సంచలనాత్మక చిత్రం “ఎల్జిబిటి – ఏ లీగల్ బ్యాటిల్” ప్రశంసలు అందుకుంటోంది. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా ట్రాన్స్జండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా “ ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్ “ ఈ నెల 19th న దేశవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది, ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈ చిత్ర బృందాన్ని అభినందిస్తూ … ఫిలిం ఛాంబర్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలతో పాటు చిత్రబృందాన్ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఈ చిత్రానికి అందించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. పలు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వాలని కోరుతున్నారని, ఈ ఆదరణతో 2027లో ‘ఎల్జిబిటి’ రెండవ భాగాన్ని 2027లో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను అన్నారు.
ఈ చిత్రంలో న్యాయమూర్తి (జడ్జి) పాత్రలో మెరిసిన సీనియర్ నటుడు ఎల్.బి. శ్రీరామ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇంత గొప్ప దర్శకుడిని ఇంత ఆలస్యంగా గుర్తించడానికి నాకు అవమానంగా ఉంది. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటివరకు పి. సునీల్ కుమార్ రెడ్డి గారిని ఎందుకు గుర్తించలేదో అర్థం కావడం లేదు. ఆయన ఎంతో మల్టీ టాలెంటెడ్. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమా చూసిన తర్వాత సమాజంలో ట్రాన్స్‌జండర్లపై ఉన్న అభిప్రాయాలు మారుతాయి.” అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!