Legally Veer : రియల్ కోర్ట్ డ్రామా గా వస్తున్న‘లీగల్లీ వీర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిల్వర్ కాస్ట్ బ్యానర్ మీద స్వర్గీయ ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో ‘లీగల్లీ వీర్’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. రవి గోగుల దర్శకత్వం వహించారు. సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
Also Read : Manchu Family : మాట మార్చి.. మడమ తిప్పిన మోహన్ బాబు..
Also Read
ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో హీరో, వీర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు. కరోనా టైంలో పాడ్ కాస్ట్ చేయాలని అనుకున్నాను. ఆ టైంలో నాకు సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. మంచి సినిమా చేద్దాం అనుకున్న, లీగల్ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్రను చేయడం సులభంగా అనిపించింది. ఇంతవరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను. నటనకు కొత్త కావడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా టేక్స్ తీసుకున్న. డబ్బింగ్‌లో ప్రాబ్లం వచ్చింది కానీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డిసెంబర్ 27 విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. డైరెక్టర్ రవి మాట్లాడుతూ.. ‘వీర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపిస్తుంది. గ్లింప్స్ చూశాకా నాకు మాటలు రావడం లేదు. మా సినిమాకి మీడియా ప్రోత్సహించి, ఆదరించాలి’ అని అన్నారు. నటుడు గిరిధర్ మాట్లాడుతూ ‘కొత్త టీం అయినా కూడా సినిమాని చాలా బాగా అద్భుతంగా చిత్రీకరించారు. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది కానీ ఇలాంటి టీం ఇంత వరకు చూడలేదు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
-
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి జైలుకు తరలింపు
-
Suji Chilla Pizza Recipe: పిండికి బదులుగా బొంబాయి రవ్వతో కరకరలాడే పిజ్జా.. ఇంట్లోనే నిమిషాల్లో రెడీ!
-
BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!