ధనుష్ హీరోగా, నాగార్జున, రష్మిక కీలక పాత్రలలో నటిస్తున్న కుబేర మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. తర్వాత కాస్త బజ్ తగ్గినట్లు అనిపించినా, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
Also Read:Hyderabad Traffic Police – Prabhas: అబ్బా.. అబ్బా.. ఏమి వాడకం అయ్యా!
ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి “2 డేస్ టు గో” పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా ఇన్నోవేటివ్‌గా అనిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ధనుష్ ఒక బెగ్గర్ పాత్రలో నటిస్తున్నాడు, నాగార్జున దేవా అనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ధనుష్ దగ్గర కాస్త మురికి అంటుకున్నట్టు, అలాగే డబ్బులు అతని ముఖానికి అంటుకున్నట్టు కనిపించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.
Also Read: Peddi : ‘పెద్ది’ క్రేజ్ మ్యాటర్స్.. అంతకు మించి!
ఒక్కసారిగా ధనుష్ నిజంగానే ప్రాస్థెటిక్ మేకప్ వేసుకున్నాడా అనే అనుమానం కలిగేలా ఈ పోస్టర్ ఉంది. పోస్టర్‌లోనే ఈ రేంజ్‌లో అంచనాలు పెంచుతున్నారంటే, కచ్చితంగా సినిమా గట్టి సౌండ్ చేసేలాగే ఉందని అంచనాలు ఉన్నాయి. మరి, సినిమా ఎలా ఉండబోతోంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకోబోతోంది అనేది చూడాలి.