కుబేర…ధనుష్, నాగార్జున,శేఖర్ కమ్ముల లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా…ఇంకా రిలీజ్ కి పట్టుమని 10 రోజులు లేదు.మామూలుగా అయితే ఇప్పటికే ఈ సినిమా పై భారీ హైప్ ఉండాలి.ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉండాలి.ఆసక్తి, అంచనాలు పక్కనబెడితే అసలు ఈ సినిమా గురించి సినిమా సర్కిల్స్ లో తప్ప బయటివాళ్లకు ఇలాంటి ఒక సినిమా ఉందని కూడా తెలుసా? లేదా?అనే టాక్ నడుస్తుంది.మేకర్స్ కూడా అంతే తాపీగా ఉన్నారు.
ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంటర్వూస్ ఇచ్చారు.మామూలుగా అయితే అవి సినిమా పై బజ్ క్రియేట్ చేసి,ఆడియన్స్ లో సినిమా చూడాలి అనే క్యూరియాసిటీ కలిగించాలి.కానీ అవి బూమరాంగ్ అయినట్టు కనిపిస్తున్నాయి.కుబేర సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.అయితే దేవి ఈ సినిమాకి ఇంకా రెండు పాటలు ఇవ్వాలట.ఈ విషయం ఏ రకంగా సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందో వాళ్ళకే తెలియాలి.ఇక ఈ రోజుల్లో సినిమా రెండున్నర గంటలు తప్ప ఎక్కువ టైం ఉంటే ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నారు.బాహుబలి,అర్జున్ రెడ్డి,పుష్ప, దేవర లాంటి ప్రాజెక్ట్స్ తప్ప మిగతా వాటిని చాలా సింపుల్ గా కాలిక్యులేట్ చేస్తున్నారు.మరి కుబేర రన్ టైం గం 2:45నిమిషాల నుండి గం 2:50 నిమిషాల వరకు ఉంటుంది అంటున్నారు…దీంతో అంత లెంగ్త్ ఉందా అని నిట్టూరుస్తున్నారు ప్రేక్షకులు.
ఇక ఐదు భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇప్పటివరకు BMS యాప్ లో లక్ష 50 వేల ఇంట్రెస్ట్ లు ఉంటే దానినే పెద్ద నంబర్ అన్నట్టు మాట్లాడుతున్నారు.ఇక సినిమాకి బజ్ లేదు కదా అంటే సినిమా బావుంటే వస్తుంది, లేకపోతే లేదు అంటే సినిమా పై ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్ ఉన్నట్టా? లేనట్టా?.. పైగా ఈ మధ్య పవన్ కళ్యాణ్ రియాక్షన్ తో ఆ నలుగురిపై కోపంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.ఆ నలుగురిలో ఒకరే ఈ సినిమా నిర్మాత అనే టాక్ కూడా వినిపిస్తుంది…ఇలా అనేక రకాలుగా అసలే అంతంత మాత్రంగా ఉన్న బజ్ ని మరింత తగ్గించి,నెగెటివిటీ ప్రమోట్ చేసినట్టు ఉంది పరిస్థితి…ఈ డ్యామేజ్ ని తగ్గించి,నెగెటివిటీ నుండి ఎవరు, ఎలా బయటపడేస్తారో చూడాలి.