కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. సార్ తర్వాత ధనుష్ తెలుగులో నటించిన స్ట్రయిట్ సినిమా కుబేర. విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్మల దర్శకత్వం వహించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు.
Also Read : HHVM : వీరమల్లు డే 2 కలెక్షన్లు.. డిజాస్టర్
థియేటర్స్ లో ఈ సినిమా టాలీవుడ్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. గొప్ప ప్రయత్నం అని యూనిట్ కు ప్రశంసలు కూడా వచ్చాయి. ధనవంతుడికి మధ్యతరగతి వాడికి మధ్య జరిగే బ్యాటిల్ ను శేఖర్ కమ్ములు అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా ధనుష్ నటనకు క్రిటిక్స్ సైతం శెభాష్ అని కితాబు అందుకున్నాడు. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను రిలీజ్ కు ముందు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నెల 18న కుబేర ఆమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. కానీ థియేటర్స్ లో వచ్చిన అప్లాజ్ కుబేరకు ఓటీటీ రిలీజ్ టైమ్ లో రాలేదు. భారీ వ్యూస్ వస్తాయని ఆశించిన అమెజాన్ కు ఆశించింత రాలేదని చెప్పాలి. ప్రస్తుతం అమెజాన్ లో స్టార్ హీరోల సినిమాలు ఏవి లేకవపోవడంతో టాప్ – 1 లో కొనసాగుతోంది.