Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ జ్యువెలరీ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. రక్షాబంధన్ పండుగ నేపథ్యంలో రూపొందించిన ఈ యాడ్ లో కృతి ధరించిన ఇండో వెస్ట్రన్ దుస్తులపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె వేసుకున్న బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, రాఖీ వేడుకను చూపించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మరోవైపు మాత్రం కృతికి అభిమానులు, మోడ్రన్ థింకర్స్ మద్దతుగా నిలుస్తున్నారు.
ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ GIVA కోసం రూపొందించిన ఈ యాడ్‌లో కృతి సనన్ తన సోదరుడికి రాఖీ కడుతున్నట్లు కనిపించారు. ఈ సందర్భంగా ఆమె బ్రాలెట్ తరహా బ్లౌజ్, ష్రగ్, డ్రేప్డ్ స్కర్ట్‌తో కూడిన ఇండో వెస్ట్రన్ లుక్‌లో దర్శనమిచ్చారు. అంతేకాదు ఆమె అదే డ్రెస్ లో కుక్కకు కూడా రాఖీ కట్టారు. సాధారణంగా రక్షాబంధన్ వంటి పండుగల్లో సంప్రదాయ దుస్తులు కనిపిస్తాయని, కానీ ఈ ప్రకటనలో మాత్రం మోడ్రన్ ఫ్యాషన్‌ను చూపించడంపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read
ముఖ్యంగా రాఖీ కట్టే సమయంలో పూజా పళ్లెం, తిలకం వంటి సంప్రదాయ అంశాలు కనిపించకపోవడాన్ని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. పండుగ సంప్రదాయ స్వరూపాన్ని చూపించే ప్రకటనలో ఇలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు. కృతి ధరించిన బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్‌ను కొందరు నెటిజన్లు మరింత ఘాటుగా విమర్శిస్తూ, అది రాఖీ పండుగకు సరిపోయే దుస్తులు కాదని కామెంట్లు చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో మరో వర్గం మాత్రం కృతికి మద్దతుగా నిలుస్తోంది. ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్‌ను భారతీయ పండుగలతో కలిపి కొత్త తరహాలో చూపించడం తప్పేమీ కాదని వారు అంటున్నారు. ఒక నటిని ఆమె దుస్తుల ఆధారంగా విమర్శించడం సరికాదని, ప్రకటన వెనుక ఉన్న కాన్సెప్ట్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మహిళలు ఏ సందర్భంలో ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్ణయించే హక్కు ఇతరులకు లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇలా కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు భిన్నమైన అభిప్రాయాలకు కారణమైంది. ఒకవైపు సంప్రదాయాల పరిరక్షణ పేరుతో విమర్శలు వస్తుండగా, మరోవైపు మారుతున్న ఫ్యాషన్ కు మద్దతుగా కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ వివాదంపై కృతి సనన్ లేదా GIVA సంస్థ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మొత్తానికి రాఖీ పండుగ సందర్భంగా విడుదలైన ఓ జ్యువెలరీ ప్రకటన.. దుస్తుల కారణంగా ఊహించని స్థాయిలో సోషల్ మీడియా చర్చకు దారితీసింది.
- Tags
- cinema
- Kriti Sanon
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!