Kriti Sanon: ‘అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే తట్టుకోలేరు’.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కృతి సనన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kriti Sanon: బాలీవుడ్ ఇండస్ట్రీ గ్లామర్ వెనుక దాగున్న జెండర్ వివక్ష, డబుల్ స్టాండర్డ్స్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఇప్పటికీ హీరోయిన్లను చాలా తేలికగా తీసుకుంటారని, సెట్స్‌లో వారిని తక్కువ చేసి చూసే ధోరణి ఇంకా కొనసాగుతోందని ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ.. తాను కెరీర్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను, షూటింగ్ స్పాట్లో ఎదుర్కొన్న వివక్షను ధైర్యంగా బయటపెట్టారు. సెట్స్‌లో ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ల ప్రవర్తనను కృతి తప్పుబట్టారు. “అసిస్టెంట్ డైరెక్టర్లకు హీరోల టైమింగ్స్ అంటే కాస్త భయం ఉంటుంది. అందుకే హీరోలు ఇంకా రెడీ కాకపోయినా పర్లేదు కానీ, హీరోయిన్లను మాత్రం ముందే పిలిచి సెట్స్‌లో కూర్చోబెడతారు. ఫీమేల్ యాక్టర్స్ టైమింగ్‌ను వాళ్లు చాలా లైట్‌గా తీసుకుంటారు” అంటూ కృతి సనన్ కుండబద్దలు కొట్టారు.
అలాగే సినిమాలోని సీన్స్ లేదా క్యారెక్టర్ గురించి హీరోయిన్లు ఏవైనా డౌట్స్ అడిగితే సెట్స్‌లో చూసే కోణమే వేరుగా ఉంటుందని కృతి సనన్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక ఫీమేల్ యాక్టర్ ప్రశ్నలు అడిగితే.. ‘అబ్బా.. ఈమె మళ్లీ ప్రశ్నలు మొదలుపెట్టింది, ఎన్ని అడుగుతుంది’ అన్నట్లుగా గుసగుసలు వినపడతాయి. ఇది నా విషయంలో కూడా జరిగింది. నేను ఏవైనా డౌట్స్ అడిగితే.. ‘మరీ అంతగా ఓవర్ అనలైజ్ చేయకు’ అని అనేవాళ్లు. అదే ప్రశ్నను పక్కనున్న మేల్ స్టార్ (హీరో) అడిగితే మాత్రం.. ‘వావ్.. అతను సినిమాలో చాలా ఇన్వాల్వ్ అవుతున్నాడు.. ఓకే అతను చెప్పింది చేద్దాం’ అంటూ ప్రశంసిస్తారు. నేను చెప్పిన పాయింట్‌నే హీరో చెప్తే వెంటనే ఒప్పుకుంటారు” అని కృతి పేర్కొన్నారు. షూటింగ్ లొకేషన్లలో హీరో, హీరోయిన్లకు ఇచ్చే వసతుల్లోనూ స్పష్టమైన తేడాలు ఉంటాయని కృతి సనన్ స్పష్టం చేశారు. ఇక్కడ సమస్య లగ్జరీ వసతుల గురించి కాదని.. ఆత్మగౌరవానిది అని ఆమె చెప్పారు. సినిమా సెట్స్‌పై కృతి సనన్ చేసిన ఈ బోల్డ్ అండ్ షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
తాజావార్తలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!