Kotha Loka : భారత తొలి మహిళా సూపర్ హీరో మూవీ ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే అరుదు. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక 1: చంద్ర’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. విడుదలైన తక్షణమే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కళ్యాణి ప్రియదర్శన్ పవర్ఫుల్ లుక్‌తో ఆకట్టుకోగా, నస్లెన్ కె. గఫూర్ కూడా కీలక పాత్రలో మెప్పించారు.
ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్‌కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా, చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. భారతీయ సంస్కృతి, జానపదాలు, పురాణాలలో పాతుకుపోయిన ఒక సాహసోపేతమైన కొత్త సినిమాటిక్ యూనివర్స్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తూ.. పురాణాలను ఆధునిక యాక్షన్‌తో మిళితం చేసిన దృశ్యకావ్యంలా ఈ చిత్ర ట్రైలర్ ఉంది. ఉత్కంఠభరితమైన యుద్ధభూమి దృశ్యాలతో ట్రైలర్ ప్రారంభమైన తీరు మరింత ఆకట్టుకుంది. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కళ్యాణి ప్రియదర్శన్ చాలా శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఆమెతో పాటు, సన్నీగా నస్లెన్ కె. గఫూర్ మెప్పించారు.
Also Read
డొమినిక్ అరుణ్ రచయితగా వ్యవహరించిన ఈ మూవీకి శాంతి బాలచంద్రన్ అదనపు స్క్రీన్ ప్లే అందించారు. ట్రైలర్లో అంతర్జాతీయ స్టంట్ నిపుణుడు యానిక్ బెన్ కొరియోగ్రఫీ, జేక్స్ బెజోయ్ సంగీతం, నిమిష్ రవి ఛాయాగ్రహణం ప్రధాన బలంగా నిలిచాయి. వెండితెరపై ఓ గొప్ప దృశ్యకావ్యాన్ని చూడబోతున్నామనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ఈ ‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది.
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!