Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఇప్పుడు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే హారర్, ఫోక్లోర్ సినిమాల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ప్రేక్షకులు కూడా ఇలాంటి మిస్టికల్ కథలను థియేటర్లలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే కోవలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించేందుకు వస్తున్న సరికొత్త చిత్రం “కొరివి”. మాయా నది ప్రాంతంలో దాగి ఉన్న ఒక భారీ నిధి, ఆ గుప్త నిధికి కాపలా కాసే ఓ భయంకరమైన ‘కొరివి దెయ్యం’ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సెన్సేషనల్ పాయింట్ వింటుంటేనే భయంతో పాటు ఎక్కడలేని ఆసక్తి కలుగుతోంది. తాజాగా డైరెక్టర్ శ్రీధర్ గాదె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఫస్ట్ లుక్‌తోనే భయపెడుతోంది. చీకటిలో, నిప్పులు కక్కుతూ మండుతున్న అస్థిపంజరం, దాని కింద నిప్పుల కొలిమిలా డిజైన్ చేసిన ‘కొరివి’ టైటిల్ లోగో గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.
దానికి తోడు పోస్టర్‌పై ‘ఎ విలేజ్ ఫోక్లోర్ హారర్’ అని రాసి ఉన్న ట్యాగ్‌లైన్ ఈ సినిమా జానర్‌పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
“ఎస్ ఆర్ కళ్యాణమండపం” లాంటి యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్ గాదె.. ఈసారి తన పంథా మార్చి ఒక యూనిక్ కథను ఎంచుకున్నారు. గతంలో ‘చుట్టాలబ్బాయ్’, ‘హైవే’ లాంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే బ్లాక్ బస్టర్ అయిన “కమిటీ కుర్రోళ్లు” సినిమా ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, నందు మురళీధర్, లిఖిత హీరోయిన్లుగా అలరించనున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, సతీష్ రెడ్డి మాసం కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ నాని దేవరపల్లి, యాక్షన్ డైరెక్టర్ దిలీప్ ఈ అద్భుతమైన ఫోక్లోర్ ప్రపంచాన్ని సృష్టించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ హారర్ మూవీ.. మాయా నది, నిధి, కొరివి దెయ్యం అనే ఉత్కంఠభరితమైన ఎలిమెంట్స్‌తో త్వరలోనే బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్‌కు పక్కా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది.
Also Read
తాజావార్తలు
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!