Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?

Korean Kanakaraju

Korean Kanakaraju

Korean Kanakaraju First Review: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్రం విడుదలకు ముందే ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను పెంచేసింది. ఇటీవల ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘U/A’ సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 36 నిమిషాల పర్ఫెక్ట్ రన్‌టైమ్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి ఇన్‌సైడ్ వర్గాల నుంచి అత్యంత సానుకూల నివేదికలు అందుతున్నాయి. ఫస్ట్ షో చూసిన వారి నుంచి వస్తున్న రివ్యూ విశేషాలు ఇలా ఉన్నాయి.

హైలైట్స్:

ఈ సినిమాలో వరుణ్ తేజ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఆయన ట్రాన్స్‌ఫార్మేషన్, రెండు పాత్రల మధ్య చూపించిన వేరియేషన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయని చెబుతున్నారు. డైరెక్టర్ మెర్లపాక గాంధీ రాసుకున్న వినోదాత్మక కథ, స్క్రీన్‌ప్లే ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని అంటున్నారు. నటుడు సత్య – వరుణ్ తేజ్ మధ్య వచ్చే కామెడీ సీన్లు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమని చెబుతున్నారు. వీరి కాంబినేషన్ సీన్స్ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బీజీఎం ఈ సినిమా మూడ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందట. పవర్ ఫుల్ డైలాగ్స్, పంచ్ లైన్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయని చెబుతున్నారు. అలాగే సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ క్వాలిటీతో విజువల్ ట్రీట్‌లా ఉందని అంటున్నారు. హీరోయిన్ రితిక నాయక్‌కు ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికిందని, ఆమె తన నటనతో ఆకట్టుకుందని సమాచారం. సినిమాలో కేవలం కామెడీయే కాకుండా, దర్శకుడు చూపించిన ఎమోషన్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని టాక్. మొత్తానికి ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ష్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు.