Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Korean Kanakaraju First Review: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్రం విడుదలకు ముందే ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను పెంచేసింది. ఇటీవల ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘U/A’ సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 36 నిమిషాల పర్ఫెక్ట్ రన్టైమ్తో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి ఇన్సైడ్ వర్గాల నుంచి అత్యంత సానుకూల నివేదికలు అందుతున్నాయి. ఫస్ట్ షో చూసిన వారి నుంచి వస్తున్న రివ్యూ విశేషాలు ఇలా ఉన్నాయి.
హైలైట్స్:
ఈ సినిమాలో వరుణ్ తేజ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఆయన ట్రాన్స్ఫార్మేషన్, రెండు పాత్రల మధ్య చూపించిన వేరియేషన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయని చెబుతున్నారు. డైరెక్టర్ మెర్లపాక గాంధీ రాసుకున్న వినోదాత్మక కథ, స్క్రీన్‌ప్లే ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని అంటున్నారు. నటుడు సత్య – వరుణ్ తేజ్ మధ్య వచ్చే కామెడీ సీన్లు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమని చెబుతున్నారు. వీరి కాంబినేషన్ సీన్స్ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బీజీఎం ఈ సినిమా మూడ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందట. పవర్ ఫుల్ డైలాగ్స్, పంచ్ లైన్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయని చెబుతున్నారు. అలాగే సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ క్వాలిటీతో విజువల్ ట్రీట్‌లా ఉందని అంటున్నారు. హీరోయిన్ రితిక నాయక్‌కు ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికిందని, ఆమె తన నటనతో ఆకట్టుకుందని సమాచారం. సినిమాలో కేవలం కామెడీయే కాకుండా, దర్శకుడు చూపించిన ఎమోషన్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని టాక్. మొత్తానికి ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ష్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!