విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతూ సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న హీరోయిన్ కోమలి ప్రసాద్. విశాఖపట్నంలో పుట్టిన కోమలి, చిన్నతనం అక్కడే గడిపి, తరువాత కర్ణాటకలోని బల్లారిలో పెరిగింది. ఆమె ఒక ట్రైన్డ్ డాక్టర్ కావడం విశేషం – ప్రవర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది. కానీ సినిమా మీద ఉన్న ఆసక్తి ఆమెను వెండితెరపైకి తీసుకొచ్చింది. అలా 2016లో ‘నేను సీతా దేవి’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోమలి, ఆ తర్వాత నెపోలియన్, అనుకున్నది ఒకటి అయింది ఒకటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీసీ 524 లాంటి చిత్రాల్లో నటించి తన నటనతో ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా..
Also Read :Bhagyashree : దీపికా, మృణాల్, రష్మిక, జాన్వీ తో పాటు భాగ్యశ్రీ..?
‘హిట్ 3’ సిరీస్ లో దర్శకుడు శైలేష్ కొలనాతో తన అనుభవం గురించి చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి.. కోమలి మాట్లాడుతూ.. ‘ఆయన సెట్ మీద మాట్లాడే భాషనే నాకు పెద్ద సమస్యగా అనిపించింది. ఆయన తెలుగు అర్థం కాకుండా, విడిగా, విరగగొట్టి మాట్లాడతారు. ఎక్స్‌ప్రెషన్ లేనట్టే మాట్లాడతారు. మొదట్లో ఆయన స్టైల్ అర్థం కాక ఇబ్బంది పడ్డాను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా సరదాగా చెప్పిన మాటలే కానీ, శైలేష్ ఇచ్చిన అవకాశాలతోనే తాను మంచి విజయం సాధించానని, ఆయనతో పని చేయడం నిజంగా గొప్ప అనుభవమని ఆమె పేర్కొంది. ప్రస్తుతం కోమలి ‘శశివదనే’ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ సినిమా పై ఇటీవల పెద్దగా అప్డేట్స్ లేనప్పటికీ, ఈ ముద్దుగుమ్మ బిజీగా నటిస్తూ తన యాక్టింగ్ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.