మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన విజయంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ముద్దుల కుమార్తె క్లిన్ కారా తన తండ్రికి ఇచ్చిన ఒక క్యూట్ సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న తరుణంలో.. క్లిన్ కారా తన తండ్రి రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా ఒక సర్ప్రైజ్ ఏర్పాటు చేసింది. ‘పెద్ది’ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ ఇంట్లోనే నాన్నకు అభినందనలు తెలిపేలా తన కేర్ టేకర్లు, ఇంట్లో మెయిడ్స్ అందరితో కలిసి పెద్ది సినిమాలోని పాటలకి డ్యాన్స్ చేయించి వీడియో తీయించింది.
చిన్నారి ప్లాన్ చేసిన ఈ క్యూట్ మూమెంట్ ఇప్పుడు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కూతురితో గడపడానికి ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఇప్పుడు తన కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడం, దానికి తన కుమార్తె నుంచే తొలి సర్ప్రైజ్ గిఫ్ట్ అందడంతో రామ్ చరణ్ ఎంతో ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. క్లిన్ కారా తన తండ్రి రామ్ చరణ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన ఈ అద్భుతమైన క్షణానికి సంబంధించిన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మెగా అభిమానులు ఈ వార్తను చూసి ఖుషీ అవుతున్నారు. మొత్తానికి బుచ్చిబాబు దర్శకత్వంలో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్‌తో జూన్ 4న విడుదలైన ‘పెద్ది’ చిత్రం అటు బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా.. ఇటు రామ్ చరణ్ పర్సనల్ లైఫ్‌లోనూ మరిచిపోలేని మధురమైన జ్ఞాపకాలను అందిస్తోందని చెప్పాలి!

