కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఆయన ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ సినిమాతో ఆగస్టు 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటించగా.. శ్రీధర్ దర్శకత్వం వహించాడు. నేడు కిరణ్ అబ్బవరం సందర్బంగా ఆయన తదుపరి సినిమాల అప్డేట్స్ విడుదల చేస్తున్నారు మేకర్స్..
తాజాగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సమ్మతమే’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘కలర్ ఫోటో’ ఫేమ్ చాందినీ చౌదరి కిరణ్ ప్రియురాలిగా నటిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే చాలా సహజమైన గ్రామీణ నేపథ్యం కలిగిన ప్రేమకథ చిత్రంగా తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో వుంది.
కాగా, కిరణ్ అబ్బవరం కెరీర్ లో వస్తున్న ఐదో సినిమా #KA5 పోస్టర్ ను కూడా నేడు విడుదల చేశారు. ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు కోటి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ చిత్రంతో నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ఇక ఆయన నటిస్తున్న ‘సెబాస్టియన్ పిసి524’ సినిమా కూడా లైన్ లో వుంది.
