Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర మొదలైంది. ఒకేసారి చాలా సినిమాలు థియేటర్ల మీద దండెత్తుతుండటంతో బాక్సాఫీస్ క్లాష్, థియేటర్ల పంపకాల సమస్య అనివార్యంగా మారింది. సరిగ్గా ఇలాంటి ఓవర్లాపింగ్ రిలీజ్‌ల వల్లే ‘కిరణ్ అబ్బవరం నిర్మాతగా వస్తున్నా #HATAH’ (హతహ్) టీమ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బాక్సాఫీస్ వద్ద అనవసరమైన క్లాష్‌ను నివారించేందుకు, తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం బాక్సాఫీస్ పోటీ నుంచి తప్పుకోవడం మాత్రమే కాదు, ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అందించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని మేకర్స్ స్పష్టం చేశారు. హడావిడిగా ఇతర సినిమాలతో పోటీ పడుతూ సినిమాను థియేటర్లలోకి వదిలేయడం కంటే, ప్రతి ప్రేక్షకుడికి ఆ సినిమాలోని ఫీల్‌ను 100 శాతం క్వాలిటీతో డెలివరీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మాస్టర్ ప్లాన్ వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే సినిమాను వాయిదా వేస్తున్నట్లు వివరించారు.
సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని, ఇప్పటివరకు ప్రేక్షకులు తమపై చూపించిన ప్రేమ, సపోర్ట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ‘హతహ్’ టీమ్ ఒక అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో “కొత్త తేదీ.. మరింత మెరుగైన అనుభూతి” అనే ట్యాగ్‌లైన్‌తో సినిమాపై ఉన్న అంచనాలను మేకర్స్ మరింత పెంచేశారు. ఒక అడుగు వెనక్కి వేసినా, పక్కా క్వాలిటీతో విజువల్ మరియు ఆడియో పరంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయాలనే కసితో ‘#HATAH’ టీమ్ రాబోతోందని చెబుతోంది. త్వరలోనే రాబోయే ఆ సరికొత్త రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- OM : టాలీవుడ్ పై 'ఓం' దండయాత్రకి సితార సపోర్ట్!
- Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!
- Sandeep Reddy Vanga : ‘పనిపాట లేని ఫ్లాప్ ఆర్టిస్టులు.. ఆ పరాన్నజీవుల ఏడుపంతా సినిమాలపైనే!
- Varanasi: రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ + మహేష్ స్టామినా.. ‘వారణాసి’తో ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కలు మారబోతున్నాయా.?
తాజావార్తలు
-
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
-
AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
-
OM : టాలీవుడ్ పై ‘ఓం’ దండయాత్రకి సితార సపోర్ట్!
-
IRDAI New Motor Insurance Rules: కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్!
-
AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!